పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

-

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రామ్‌చరణ్(Ram Charan) దంపతులు, చిరు సతీమణి సురేఖ భావోద్వేగానికి గురయ్యారు. కాగా గతంలోనే చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

కాగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాల ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. 5 మందికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. అయితే వీరిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రదానం చేశారు. ఇక మిగిలిన వారికి ఇప్పుడు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువు కేంద్రమంత్రులతో పాటు అధికారులు అతిథులుగా హాజరయ్యారు.

Read Also: జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...