Harirama Jogaiah | చంద్రబాబు చేత సీఎం షేరింగ్ మాట చెప్పించగలరా..? పవన్‌కు జోగయ్య లేఖ..

-

Harirama Jogaiah | సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు సమావేశమైన సంగతి తెలిసిందే. దీంతో జనసేనకు 25 ఎమ్మెల్యే, 3 ఎంపీలు కేటాయించారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు.

- Advertisement -

“సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) భేటీ కావడం, చర్చించడం గమనిస్తున్నాం. అయితే జనసేనకు 30 సీట్లని ఒక ఎల్లో మీడియా, 27 సీట్లని మరో ఎల్లో మీడియా ప్రచారం చేశాయి. ఎవరిని ఉద్ధరించడానికి ఈ రకమైన ఏకపక్ష వార్తలను ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. జనాభాలో 6 శాతం ఉన్న రెడ్లు, 4 శాతం ఉన్న కమ్మ కులస్తులు మిగిలిన బలహీన వర్గాలను ఉపయోగించుకుని రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాయి. 25 శాతం ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులను బీసీలుగా గుర్తింపు పొందకుండా విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు పొందకుండా అడ్డుకుంటున్నారు. వైసీపీని దింపాలంటే జనసేన(Janasena)కు ఇష్టం ఉన్నా, లేకపోయినా టీడీపీ(TDP)తో కలిసి వెళ్లడం తప్పనిసరి అనేది కాదనలేని పరిస్థితి” అని లేఖలో తెలిపారు.

“జనసేన లేకుండా టీడీపీ గెలవడం కష్టం అనేది 2019 ఎన్నికల్లో తేలింది. ఈ నేపథ్యంలో జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందనే ప్రశ్న ఉత్పన్నం కాకూడదు. టీడీపీకి జనసేన ఎన్ని సీట్లు ఇస్తుందనేదే ప్రశ్న కావాలి. వైసీపీ(YCP)ని అధికారం నుంచి తప్పించడం అంటే.. టీడీపీకి పూర్తి అధికారాన్ని కట్టబెట్టడం కాదు కదా. జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరగకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారు. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగకపోతే.. ఆ తర్వాత జరిగే నష్టానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సి వస్తుంది. కనీసం 50 సీట్లయినా దక్కించుకుంటేనే… రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా, పాక్షికంగా దక్కే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పదవిని మీకు రెండున్నర సంవత్సరాలైనా కట్టబెడుతున్నట్టు ఎన్నికలకు ముందే మీరు చంద్రబాబు నోటి వెంట ప్రకటించగలుగుతారా? అని ఆయన(Harirama Jogaiah) ప్రశ్నించారు.

Read Also: పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నాం.. మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని...

Janasena | ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ...