ఏపీలో వైసీపీ కౌంట్‌డౌన్‌ మొదలైంది: మోదీ

-

వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని ప్రధాని మోదీ(PM Modi ) తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలేరు బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని.. ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఇలాంటి మాఫియాలన్నింటికీ పక్కా ట్రీట్‌మెంట్ ఇస్తామని హెచ్చరించారు.

- Advertisement -

“నా ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. తిరుపతి వెంకటేశ్వరస్వామికి భక్తిప్రపత్తులతో ప్రణమిల్లుతున్నాను.. వాగ్గేయకారుడు అన్నమయ్యను ప్రస్తావిస్తూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. అనేక రకాల ఖనిజాలు కలిగి ఉన్న నేల రాయలసీమ(Rayalaseema). ఇక్కడ గనులు ఉన్నాయి. భవ్యమైన, దివ్యమైన దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు, ప్రతిభావంతులైన యువత ఉంది. పర్యాటకానికి ఎన్నో అవకాశాలున్నాయి. ఇక్కడ అనేక సమస్యలు కూడా ఉన్నాయి… ఆ సమస్యలకు హద్దే లేదు.

ఇప్పుడు నేను ఇక్కడికి మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. రాయలసీమను సర్వతోముఖాభివృద్ధి చేయడం నా లక్ష్యం. రాయలసీమ… రాష్ట్రానికి అనేకమంది ముఖ్యమంత్రులను ఇచ్చింది. కానీ ఇక్కడి ప్రజలకు ఏం లభించింది? ఇక్కడ అభివృద్ధి జరగనే లేదు, సాగునీరు లేదు, పరిశ్రమలు లేవు, ఇక్కడి రైతులు ఆందోళనలో ఉన్నారు, ఉద్యోగ ఉపాధి కోసం ఇతర నగరాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరేం చేయాలి? ఏపీలో కూడా ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కారు తీసుకురావాలి.

ఏపీలో ప్రజలు అనేక ఆకాంక్షలతో వైసీపీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రజల నమ్మకాలను వమ్ము చేసింది. విశ్వాస ఘాతుకానికి పాల్పడింది. పేదలను అభివృద్ధిలోకి తీసుకురాకుండా, మాఫియాను అభివృద్ధి చేసింది. వైసీపీ మంత్రులు గూండాయిజం చేస్తున్నారు. ఇక్కడ ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. దాదాపు 30 గ్రామాలు కొట్టుకుపోగా, 12 మంది మరణించారు. ఈ ఘటనతో నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇలాంటి మాఫియాలకు స్థానిక ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తోంది. ఈ సభ నుంచి మాఫియాకు చెబుతున్నా… మీ కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ ప్రతి మాఫియాకు తగిన రీతిలో చికిత్స చేస్తుంది. అవినీతికి పాల్పడిన ఒక్కొక్కరికి తగిన ట్రీట్ మెంట్ ఇవ్వడం ఖాయం.

ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నది మా సంకల్పం. కానీ ఇక్కడి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కు సహకరించడంలేదు. పోలవరం ప్రాజెక్టు పట్ల ఈ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో మనం చూస్తున్నాం. రాయలసీమకు సాగునీటి సౌకర్యం కల్పించడంలేదు. ఎన్డీయే సర్కారు వస్తే ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తాం. దృఢమైన ప్రభుత్వం ఉంటే దృఢమైన దేశం ఏర్పడుతుంది. ఇవాళ భారత్ శక్తిమంతంగా ఉందా, లేదా? రాయలసీమలో రైతుల జీవితాన్ని మార్చగలిగేది ఎన్డీయే ప్రభుత్వమే. రాబోయే ఐదేళ్లలో ఇక్కడ టమాటా, ఇతర కూరగాయల పంటల కోసం కోల్డ్ స్టోరేజి క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. పులివెందులలో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు వల్ల రైతులకు, యువతకు లబ్ధి చేకూరుతుంది. ఎన్డీయే కూటమి తరఫున ఏపీలో పోటీ చేస్తున్న అందరు అభ్యర్థులకు ప్రజలు ఓటేసి గెలిపించాలి” అని మోదీ(PM Modi) పిలుపునిచ్చారు.

Read Also: విదేశీ పర్యటనకు వెళ్లాలి.. అనుమతి కోరిన సీఎం జగన్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...