అదృష్టమంటే ఇతనిదే ఏం లక్ బాసు నీది

అదృష్టమంటే ఇతనిదే ఏం లక్ బాసు నీది

0
102

ఒక్కోసారి చాలా మంది పేదలు అపర కుబేరులు అవుతారు, జీవితంలో అనుకోని సంఘటనల ద్వారా ఇలా జరుగుతూ ఉంటాయి, అయితే కొందరికి లాటరీ రూపంలో ఆ జాక్ పాట్ తగులుతుంది, ముఖ్యంగా సౌదీ అబుదాబి దుబాయ్ లో చాలా మంది ఇలా లాటరీ టికెట్లు కొంటూ ఉంటారు, అలాంటి వ్యక్తి ఇతను కూడా..

కేరళ రాష్ట్రానికి చెందిన అస్సేన్ అనే వ్యక్తి అబుదాబి కి 28 ఏళ్ళ క్రితమే వెళ్ళాడు.అక్కడ ఓ బేకరీ లో పనిచేస్తూ జీవనం సాగిస్తూ కేరళలో ఉన్న తన కుటుంబ సభ్యులకి కొంత డబ్బులు పంపుతూ ఉన్నాడు, ఈ సమయంలో అతని స్నేహితులు చెప్పడంతో సరదాగా అప్పుడప్పుడు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసేవాడు.ఇప్పటికి ఐదుసార్లు కొన్నాడు లక్ రాలేదు.

తాజాగా ఈసారి లాటరీ టికెట్ కొన్నాడు.. ఈసారి ఏకంగా బంపర్ అమౌంట్ తగిలింది, ఏకంగా 24 కోట్లు లాటరీ తగిలింది అని తెలియడంతో ఆశ్చర్యపోయాడు, అంతేకాదు ఇక నా సొంత ఊరు కేరళ వెళ్లిపోతాను అని పయనం అయ్యాడు, పెద్ద బేకరి స్టార్ట్ చేస్తాడట, మంచి ఇళ్లు కొనుగోలు చేసుకుంటాను అంటున్నాడు ఈ వ్యక్తి.