ఖరీదైన ఇంటి కోసం కోట్లు ఖర్చు చేసిన అర్జున్ కపూర్ – ఎక్కడంటే ?

Arjun Kapoor who spent quotes for an expensive house

0
130

మన బాలీవుడ్ హీరోలు బడా ఇండ్లు కొంటారు అనేది తెలిసిందే, దాని కోసం ఎంత నగదు అయినా వెచ్చిస్తారు, ఇక బాంద్రాలో లగ్జరీ ఇళ్లు విల్లాలు చాలా మంది హీరోలకి ఉన్నాయి, ఇక తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ రూ. 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు అనే వార్తలు బీ టౌన్ లో వినిపిస్తున్నాయి.

మరి ఈ హీరో ఎందుకు ఈ నగదు ఖర్చు చేస్తున్నారు అని అనుకుంటున్నారా, బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, మలైకా అరోరా కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోన్న విషయం తెలిసిందే.

ముంబయిలో అత్యంత కాస్ట్ లీ ఏరియాల్లో ఒకటైన బాంద్రాలో 4 బీహెచ్కే స్కై విల్లాను కొనుగోలు చేశాడని బీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దీని ఖరీదు సుమారు 20 కోట్లు ఉంటుంది అని అంటున్నారు. ఇక అజయ్ దేవగణ్ కూడా తాజాగా ఓ ప్రాపర్టీ కొనుగోలు చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి ముంబైలో.