బిగ్‌బాస్ లో నూతన్ నాయుడుని ఎలిమినేట్ చేయడం దారుణం

బిగ్‌బాస్ లో నూతన్ నాయుడుని ఎలిమినేట్ చేయడం దారుణం

0
148

స్టార్ మా లో వస్తున్న బిగ్‌బాస్-2 షోపై నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. నూతన్ నాయుడు ఎలిమినేషన్ అనంతరం ఆమె ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నూతన్ నాయుడు కామన్ మాన్ గా వచ్చాడు..అయితే ఈ వారం ఇద్దరు కామన్ మాన్స్ ని బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేషన్ చేశారు.

నూతన్ నాయుడు ఎలిమినేషన్‌తో ప్రేక్షకుల ఓట్లకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. అమిత్ కంటే నూతన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినా అతడిని ఎలిమినేట్ చేయడం దారుణమని పేర్కొంది. కేవలం రీ ఎంట్రీ కారణంగానే నూతన్‌ను బయటకు పంపించారని ఆరోపించింది. సామాన్యుడి కోటాలో హౌస్‌లో అడుగుపెట్టిన గణేశ్, నూతన్ నాయుడులలో నూతన్ ఓసారి ఎలిమినేట్ అయి, రీ ఎంట్రీ ఇవ్వగా, గణేశ్ సెలబ్రిటీలకు దీటుగా 84 రోజులు హౌస్‌లో ఉండి సత్తా చాటాడు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఉంటుంది..సెలబ్రెటీలు..వారిలో ఎవరు విన్ అవుతారో అనేది మరికొన్ని రోజుల్లో తెలుతుంది. అయితే నూతన్ నాయుడు ఎలిమినేషన్ వల్ల సామాన్యుడిక మరోసారి అన్యాయం జరిగిందని.. ఈ ఘటనతో ఇకపై ప్రేక్షకుల ఓట్లకు పెద్దగా విలువ ఉండదని అర్థమైందని తెలిపింది. కేవలం షోను చూసి ఆనందించడానికే పరిమితం కావాలని మాధవీలత సూచించింది.