బయోపిక్ కు మోక్షజ్ఞ రెడీయా??

బయోపిక్ కు మోక్షజ్ఞ రెడీయా??

0
85

నందమూరి అభిమానుల చూపులన్నీ ఇప్పుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞపైనే ఉన్నాయి. బాలయ్య తన వారసుడిగా మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడని ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశాడు. కాకపోతే ముఖానికి ఎప్పుడు మేకప్ వేసుకుంటాడనేది మాత్రం చెప్పలేదు. సినిమాల్లోకి ఎప్పుడు అడుగు పెట్టడమనేది మోక్షజ్ఞ ఇష్టమేనని బాలయ్య చెబుతూ వస్తున్నాడు. కాకపోతే అతడి లాంచింగ్ కోసం మంచి సబ్జెక్ట్ వెతుకుతూ ఉన్నారు.

మోక్షజ్ఞ ప్రస్తుతం లాంగ్ టూర్ నిమిత్తం సింగపూర్ వెళ్లాడని తెలుస్తోంది. చాలారోజులుగా ఫిలింనగర్ లో ఫ్రెండ్స్ తో కనిపించిన అతడు సింగపూర్ కు అన్ని రోజుల టూర్ కు ఎందుకు వెళ్లాడా అని ఆరా తీస్తే కొత్త విషయం తెలిసింది. ప్రస్తుతం బాలకృష్ణ తన తండ్రి – విఖ్యాత నటుడు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చేస్తున్నాడు. ఇందులో యంగ్ ఎన్టీఆర్ గా మోక్షజ్ఞను చూపించేందుకు డైరెక్టర్ క్రిష్ ఆలోచిస్తున్నాడు. కాకపోతే ఈ రోల్ కోసం మోక్షజ్ఞ కాస్త స్లిమ్ అవ్వాలని చెప్పాడని తెలిసింది.

బాలయ్య తన కొడుకును ఇందుకోసమే సింగపూర్ పంపించాడనేది ఫిలింనగర్ టాక్. అక్కడ ఇంటర్నేషనల్ ట్రయినర్ల వద్ద మోక్షజ్ఞ ట్రయినింగ్ తీసుకోనున్నాడు. దీంతోపాటు డ్యాన్స్ – ఫైట్స్ పైన కూడా శిక్షణ తీసుకోనున్నాడని తెలుస్తోంది. మోక్షజ్ఞ పర్ ఫెక్ట్ గా రెడీ అయితే ఎన్టీఆర్ బయోపిక్ లోనే అతడిని తాత గెటప్ లో చూసేయొచ్చు.