బాలీవుడ్ సినిమాలో నయనతార కోలీవుడ్ టాక్

Nayanthara in Bollywood movie-Kollywood Talk

0
197

నయనతార చిత్ర సీమలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె ఒక్కసారి కూడా సినిమాలకు గ్యాప్ ఇవ్వలేదు. ఇటు తెలుగు, తమిళ చిత్ర సీమలో ప్రముఖ హీరోలు అందరితో ఆమె సినిమాలు చేసింది. ఇక ఆమె చేసినన్ని సినిమాలు ఆమెతో పాటు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఏ హీరోయిన్ చేయలేదు. చాలా వేగంగా ఆమె సినిమాలు పూర్తి చేసింది.

అంతేకాదు సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన గా మారింది. తెలుగులో కూడా సీనియర్ హీరోలు, యంగ్ హీరోలుతో అనేక సినిమాలు చేసింది నయన.ఆమె తెలుగు మలయాళ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

నయనతార ఇంతవరకూ హిందీలో మాత్రం సినిమా చేయలేదు. షారుక్ ఖాన్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ఒక బాలీవుడ్ సినిమా చేయడానికి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ కరోనా కారణంగా ఈ సినిమా ఆలస్యమైంది. లేకపోతే సినిమా సెట్స్ మీద ఉండేది. అయితే ఈ సినిమాలో నయన నటించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. సో చూడాలి మరి ఆమె ఈ సినిమాలో నటిస్తారో లేదా అనేది, అఫీషియల్ ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.