బ్రేకింగ్ న‌య‌న‌తార ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం

బ్రేకింగ్ న‌య‌న‌తార ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం

0
158

తెలుగు, త‌మిళ్, హిందీ వంటి భాష‌ల్లో న‌టించి గ‌తంలో స్టార్ డ‌మ్ ను తెచ్చుకున్న హీరోయిన్ న‌య‌న‌తార పెళ్లి విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌రంగా మారుతోంది. శింబు న‌య‌న్ ప్రేమ వ్య‌వ‌హారం పుల్ స్టాప్ ప‌డిన త‌ర్వాత ఇంత‌వ‌ర‌కు ఈ ముద్దుగుమ్మ‌ పెళ్లి ఊసే ఎత్త‌లేదు. దీంతో న‌య‌న్ అభిమానులు ఎప్పుడేప్పుడు ఆమె పెళ్లి విష‌యం బ‌య‌ట‌పెడుతాదాని ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు జీటీ నందు న‌య‌న‌తార పెళ్లి విష‌యంపై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. శింబు న‌య‌న్ ప్రేమ వివాహం, అ త‌ర్వాత వారు విడిపోవడానికి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని అయితే త‌న‌కు తెలిసి ఒక కార‌ణం క‌రెక్ట్ అయి ఉండ‌వ‌చ్చు అని అన్నాడు. తాను కొద్దిరోజుల‌క్రితం శింబుత‌ర‌పు ఒక వ్య‌క్తిని తీసుకుని వెళ్లి జ్యోతిష్యుడుని క‌లిశామ‌ని, అత‌ని ద‌గ్గ‌ర న‌య‌న్ శింబు జాత‌కాలు గురించి అడిగి తెలుసుకున్నామ‌ని అన్నాడు.

న‌య‌న‌తార మ‌ళ్లీ వివాహం చేసుకుంటే ఖ‌చ్చితంగా రోడ్డున ప‌డే అస్కారం ఉదంని అదే పెళ్లి చేసుకోక‌పోతే రాజ‌యోగం వ‌రిస్తుంద‌ని అలాగే ఆమె ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని త‌న‌కు జ్యోతిష్యుడు చెప్పాడ‌ని చెప్పి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు నందు. అయితే ఆమె పెళ్లి చేసుకోక‌పోవాడానికి ఇదే కార‌ణం అయి ఉండ‌వ‌చ్చ‌ని ద‌ర్శ‌కుడు నందు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.