చిత్తూరులో టీడీపీకి దారుణమైన న్యూస్

చిత్తూరులో టీడీపీకి దారుణమైన న్యూస్

0
105

తెలుగుదేశం పార్టీకి గట్టి మెజార్టీ వచ్చే జిల్లాగా గుంటూరు కృష్ణాలను చెబుతారు ..తర్వాత బాబు సొంత జిల్లా చిత్తూరు మెజార్టీ స్ధానాలు సాధిస్తుంది అని నమ్మకంగా తెలుగుదేశం నేతలు చెబుతుంటారు. అయితే గత ఎన్నికల్లో బాబు పవన్ మోదీతో కలిసి వచ్చినా వైసీపీ కంటే తక్కువ స్ధానాలు గెలుచుకున్నారు. దీనిపై అప్పుడు పెద్ద చర్చ నడిచింది, సొంత జిల్లాలో ప్రజలు కూడా బాబుని నమ్మడం లేదా అనే విమర్శలు వచ్చాయి .. గత ఎన్నికల్లో బాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో వైసీపీకి మెజార్టీ స్ధానాలు వచ్చాయి.. జిల్లాలో 14 అసెంబ్లీ స్ధానాలలో వైసీపీ 8 టీడీపీ ఆరు స్ధానాలు గెలుచుకుంది.

ఇది తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ ఏర్పరచింది. పార్టీ ఫిరాయింపులు చేసి ఇక్కడ నుంచి మంత్రి పదవి కూడా ఓ వైసీపీ ఎమ్మెల్యేకి ఇచ్చారు.. కాని ఇప్పుడు సీన్ మారింది. దీనికి రివర్స్ అవుతుంది అంటున్నారు కొందరు నేతలు.. ముఖ్యంగా సర్వేలు కూడా ఇదే విషయాన్ని తెలియచేస్తున్నాయట.. గత ఎన్నికల్లో కంటే ఈసారి వైసీపీ రెండు స్ధానాలు ఎక్కువ గెలిచే అవకాశం ఉంది అని చెబుతున్నారు.. ఇక్కడ 14 స్ధానాల్లో పది స్ధానాలు వైసీపీ నాలుగు స్ధానాలు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది అని సర్వేలో తేలిందట. ఇది బాబు సొంత జిల్లా అయి ఉండి, ఎందుకు భారీ గెలుపు సాధించలేకపోతున్నాము అనే ఆత్మవిమర్శ సొంత పార్టీ నేతలే చేసుకుంటున్నారట.

.