సీఎస్ ఓవరాక్షన్ టీడీపీ యాక్షన్

సీఎస్ ఓవరాక్షన్ టీడీపీ యాక్షన్

0
102

మొత్తానికి రాష్ట్రాన్ని నడపించేది సీఎం అయితే ఉద్యోగులను పాలనను యంత్రాంగాన్ని నడిపించేది సీఎస్. ఈసారి ఎక్కడా లేనటువంటి విడ్డూరం కనిపిస్తోంది ఏపీలో…ఎన్నికల కమిషన్ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఓవరాక్షన్ చేస్తున్నారని రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు, ఎన్నికల సమయంలో కావాలనే కుట్రలు చేస్తున్నారని, ఏపీలో ఎలాంటి సమస్యలు వచ్చినా సీఎం చూస్తారు, అలాగే అక్కడ నరేంద్రమోదీ ప్రధానిగా, పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ చూస్తున్నారు. వారికి ఎవరికి రాని అడ్డు ఇక్కడ సీఎస్ ఎందుకు మెలిక పెడుతున్నారు అని విమర్శించారు ఉపముఖ్యమంత్రి చినరాజప్ప.

ఎన్నికల అధికారులు చేయాల్సిన పని ఈయన చేస్తున్నారు అని విమర్శించారు. అసలు ఎక్కడైనా కౌంటింగ్ విషయంలో సీఎస్ ఎలా మీటింగ్ పెడతారు అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలి అని చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. ఓ పక్క సీఎం ఇలా సమీక్షలు చేయకూడదు అని చెబుతున్నారు.. మరి సీఎస్ ఎలా ఇలా సమీక్షలు చేస్తున్నారు అని ఎన్నికల కమిషన్ పై ఆయన మంపడ్డారు. సీఎంకి మంత్రుల అధికారాలు కట్టడి చేయాలి అని సీఎస్ ఎల్వీ పనిచేస్తున్నారు అని విమర్శించారు. ఫలితాల వరకూ ఈ వార్ ఇలానే ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు.