రఘురామకృష్ణంరాజుకి గుడ్ న్యూస్ చెప్పిన జగన్

రఘురామకృష్ణంరాజుకి గుడ్ న్యూస్ చెప్పిన జగన్

0
84

నరసాపురం రాజకీయాల్లో కింగ్ గా పేరు తెచ్చుకున్నారు కాంగ్రెస్ లో కనుమూరి బాపిరాజు.. ఆ తర్వాత మరో రాజు గారు గోకరాజు గంగరాజు గత ఐదేళ్లలో ఎంపీ అయ్యారు.. ఇప్పుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు నరసాపురం నుంచి ఎంపీ అయ్యారు.. మొత్తానికి రాజులకు ఇది కోట అనే చెప్పాలి. రాజకీయంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబాలే ఇక్కడ గెలుస్తున్నాయి. అలాగే రాజకీయాలు కూడా వారి చుట్టూ తిరగుతూనే ఉంటాయి.

మరి తాజాగా రఘురామకృష్ణంరాజు వైఖరి నచ్చక వైయస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజును, ఆయన సోదరులు నరసింహరాజు, రామరాజులను జగన్ వైసీపీలో చేర్చుకున్నట్లు చెబుతున్నారు. కొందరు ఇదే అంటుంటే మరికొందరు మాత్రం పార్టీని మరింత పుంజుకునేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. దీనికి కారణం కూడ చెబుతున్నారు.

ఎందుకు అంటే అదే పార్లమెంట్ సెగ్మెంట్ అయిన పాలకొల్లులో టీడీపీ గెలిచింది.. సో అక్కడ కూడా వైసీపీ పుంజుకునేలా చూస్తున్నారు.. పలువురు నేతలు పార్టీలోకి వస్తే ఆహ్వనిస్తున్నారు. అంతేకాని రఘురామకృష్ణంరాజుకి చెక్ పెట్టే ఆలోచన లేదు అని , కేవలం ఇవి కల్పిత వార్తలు అని కొట్టిపారేస్తున్నారు.. ఎందుకు అంటే జగన్ కు రఘురామకృష్ణంరాజుకి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటున్నారు పార్టీ నేతలు.