స్థానిక సంస్థల టైమ్ లో సీఎం జగన్ కు బిగ్ షాక్… టీడీపీలోకి భారీ చేరికలు…

స్థానిక సంస్థల టైమ్ లో సీఎం జగన్ కు బిగ్ షాక్... టీడీపీలోకి భారీ చేరికలు...

0
191

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది… వైసీపీ కంచుకోట అయిన కర్నూల్ జిల్లాలో టీడీపీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి… తాజాగా కోడుమూరుకు చెందిన సూమారు 300 మంది వైసీపీ నేతలు మాజీ మంత్రి కోట్ల సుర్యప్రకాశ్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు..

వీరందరు వైసీపీ గెలుపుకోసం ఎంతో కష్టపడ్డారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకునే వారు కరువు అవ్వడంతో అసంతృప్తితో టీడీపీలో చేరిపోయారు.. పార్టీలో చేరేందుకువచ్చిన వీరిని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు…

కోడుమూరు కోట్లకు సొంతనియోజకవర్గం కాకపోయి వారికి ఇక్కడ మంచి పట్టుఉంది… ఈ క్రమంలో అసంతృప్తులను తన వైపు తిప్పుకునే దానిలో కోట్ల సక్సెస్ అయ్యారు…