సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ. వీ.హనుమంతరావు(Hanumantha Rao) అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో అందరూ బలగం సినిమా(Balagam Movie) తరహాలో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నరేంద్ర మోడీ(Modi) వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఉందా.. లేదా అనిపిస్తుందన్నారు. నల్లధనం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామన్నారని.. ఎన్నో చెప్పారు కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
నిరుద్యోగ యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ ఇవ్వలేదన్నారు. రైతులను కూడా మోసం చేశారని విమర్శించారు. పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్‌పరం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని పార్లమెంట్ నుంచి అనర్హత వేటు వేసి, ఇల్లు ఖాళీ చేయించడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉండదన్నారు. బండి సంజయ్(Bandi Sanjay) నిరుద్యోగ యువత కోసం పోరాటం అంటున్నారని.. తమరు ఇస్తామన్నా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని వీహెచ్(Hanumantha Rao) ప్రశ్నించారు.
Read Also: రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే మొదటి అసెంబ్లీ సీటు అదే: భట్టి
Follow us on: Google News, Koo, Twitter