Minister Jagadish Reddy | అడవిబిడ్డల జీవితాల్లో వెలుగులు నిండాయి: జగదీష్ రెడ్డి

-

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాటి పాలకులు ఫ్లోరోసిస్ పాపాన్ని పెంచి పోషించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) విమర్శలు చేశారు. అటువంటి శాపం నుండి ఆరు సంవత్సరాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ విముక్తి క‌ల్పించార‌ని తెలిపారు. సోమవారం యాదాద్రి భువ‌నగిరి జిల్లా కలెక్టరేట్‌లో గిరిజనులకు మంత్రి పోడు భూముల పట్టాల(Podu Land Titles) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గిరిజనులు, గోండులు, అడవిబిడ్డల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. పోడు భూముల పట్టాలు అందుకున్న గిరిజన రైతాంగానికి తక్షణమే రైతు బంధు పథ‌కం అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించారు.

- Advertisement -

పాలనలో అద్భుతాలు సృష్టించిన నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోతారని ఆయన కొనియాడారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. తద్వారా తండాలలో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. 2001 నాటి పరిస్థితులను అధ్యయనం చేసిన మీదట ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర సాధన ఉద్యమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. సాధించిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందే తడవుగా నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీరు, త్రాగునీరు, కళ్యాణాలక్ష్మి/షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి ప‌థ‌కాల‌ను అమ‌లు చేశార‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) తెలిపారు.

Read Also:
1. పెళ్లి కాని వారికి పెన్షన్.. సీఎం కీలక నిర్ణయం
2. మీరు 10 ఇస్తే మేము 80 ఇస్తాం: రేవంత్ రెడ్డి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...