MLC Kavitha: లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు 

-

లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. నేటితో సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు కవితను కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా.. 9 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు. అంతకుముందు కోర్టుకు హాజరయ్యే క్రమంలో కవిత మీడియాతో మాట్లాడుతూ ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ అని ఆరోపించారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడిందే లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారని చెప్పారు. రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని కొత్తగా అడిగేందుకు ఏం లేదన్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే సీబీఐ కస్టడీలో ఉన్న కవితను ఆదివారం సాయంత్రం ఆమె సోదరుడు కేటీఆర్, భర్త అనిల్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కలిసి ధైర్యం చెప్పారు. మరోవైపు మనీల్యాండరింగ్ కేసులో కవితకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటీషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. కాగా లిక్కర్ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నేటితో ఆమె అరెస్టై సరిగ్గా నెల రోజులు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

త్వరలో అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత...

టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదల.. మహిళలకు వరాలు..

టీడీపీ, జనసేన, బీజేపీ(TDP-Janasena-BJP) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. చంద్రబాబు, పవన్...