వచ్చే ఎన్నికల్లో కూడా ఏపీ లో అధికారం టీడీపీదే

వచ్చే ఎన్నికల్లో కూడా ఏపీ లో అధికారం టీడీపీదే

0
129

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఇప్పుడే ఎన్నికల నాటి వేడిని చూపిస్తున్నాయి. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు తన మార్క్ రాజకీయం తో ఏపీ ని అభివృద్ధి లో ముందుకుతీసుకుపోతున్నాడు. అలాగే ప్రతిపక్ష నేత జగన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా అధికారం లోకి రావాలని రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తున్నాడు.

ఇప్పుడు ఏపీ రాజకీయం మొత్తం టీడీపీ, వైసీపీ , జనసేన మధ్యే తిరుగుతింది. ఏపీ లో ఉండే ప్రస్తుత రాజకీయం పై మాజీ మంత్రి సబ్బంహరి మాట్లాడుతూ.వచ్చే ఎన్నికల్లో కూడా ఏపీ లో అధికారం టీడీపీదే అని జ్యోసం చెప్పారు. ప్రస్తుత పరిస్థుతలపై మాట్లాడిన అయన ఏపీ లో జగన్, జనసేన అధినేత పవన్ బీజేపీ చెప్పిందే చేసుకుంటూ పోతున్నారు అని వారిపై తీవ్రమైన విమర్శలు చేసారు.

చంద్రబాబు నాయుడు గారు నాలుగు సంవత్సరాలపాటు బీజేపీ తో స్నేహంగా ఉంది రాష్ట్రాన్నీ కొంతమేర అయిన అభివృద్ధి చేసారు. బీజేపీ తో స్నేహంగా లేకపోతె ఆ అభివృద్దికూడా కనిపించేది కాదు అని అయన చెప్పారు. చంద్రబాబు చేసిన మంచి పనులే ఆయనను మళ్ళీ అధికారం లోకి తీసుకువస్తామని చెప్పారు.

2019 ఎన్నికల్లో తప్పనిసరిగా తాను ఎన్నికల బరిలో దిగుతానని సబ్బం హరి స్పష్టం చేశారు. ఏ పార్టీ తరఫున అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు.