యాషెస్ సిరీస్‌లో జోరు మీదుంది ఆస్ట్రేలియా. వరుసగా రెండు టెస్టులు గెలిచి జోష్ లో ఉన్నారు. మరోవైపు రెండు ఓటములతో నిరాశలో కూరుకుపోయింది ఇంగ్లాండ్ జట్టు. ఇక ఈ రెండు జట్లు ముచ్చటగా మూడో పోరులో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.
మెల్బోర్న్ వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు వారి తుదిజట్లను ప్రకటించాయి.
ఇంగ్లాండ్ జట్టు
ఇంగ్లాండ్ జట్టులో కీలక మార్పులు చేసింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న ఓపెనర్ రోరీ బర్న్స్‌తో పాటు ఒల్లీ పోప్‌కు మొండిచేయి చూపింది. దీంతో స్టార్ ఓపెనర్ బెయిర్ స్టోతో జట్టులోకి వచ్చాడు. అలాగే స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను తుదిజట్టులోకి తీసుకోలేదు.
హసీబ్ హమీద్, జాక్ క్రాలే, డేవిడ్ మలన్, రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, బెయిర్‌స్టో, బట్లర్, మార్క్ వుడ్, ఒల్లీ రాబిన్సన్, జాక్ లీచ్, అండర్సన్
ఆస్ట్రేలియా జట్టు
కరోనా వచ్చిన వ్యక్తికి దగ్గరగా ఉన్న కారణంగా అడిలైడ్ టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే యువ పేసర్ స్కాట్ బోలాండ్ ఈ మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేయబోతున్నాడు. జే రిచర్డ్సన్, హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్ కు దూరం కానున్నారు.
వార్నర్, మార్కస్ హారిస్, లబుషేన్, స్మిత్, హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారే, కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథల్ లియోన్, స్కాట్ బోలాండ్.