టెస్టుల్లో అశ్విన్ అరుదైన ఫీట్

Ashwin's rare feat in Tests

0
99

టీమ్​ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్​గా నిలిచాడు. స్పిన్ దిగ్గజం హర్భజన్​ సింగ్​ను వెనక్కినెట్టి ఈ ఘనత సాధించాడు అశ్విన్.

భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు ఐదో రోజు మ్యాచ్​లో భాగంగా కివీస్​ బ్యాటర్ టామ్ లాథమ్​ను ఔట్​ చేసి అశ్విన్​ ఈ ఫీట్ సాధించాడు. టెస్టుల్లో హర్భజన్ సింగ్ సాధించిన 417 వికెట్ల ఘనతను అధిగమించాడు. అశ్విన్​ ఇప్పటివరకు 30 సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఘనత సాధించాడు.

ఈ జాబితాలో తొలి స్థానంలో అనిల్ కుంబ్లే ఉండగా..రెండో స్థానంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఉన్నాడు. కుంబ్లే 132 టెస్టులలో 619 వికెట్లు తీయగా.. కపిల్ దేవ్ 131 టెస్టులలో 434 వికెట్లు పడగొట్టాడు. కుంబ్లే లెగ్ స్పిన్నర్ కాగా.. కపిల్ దేవ్ మీడియం పేసర్. ఒకవేళ అశ్విన్  ఐదు వికెట్లు తీస్తే ఈ లిస్ట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ అవుతాడు.