హైదరాబాద్ లో దారుణం..అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త

0
124

ప్రస్తుతం ఎంతోమంది కాపురాలలో అనుమానం పెనుభూతంగా మారి ప్రాణాలను బలితీసుకుంటుంది. ఇప్పటికే అనుమానం అనే కారణంతో ఎంతోమంది హత్యలు, ఆత్మహత్యలు చేసుకోగా..తాజాగా ఇలాంటి కారణంగానే తెలంగాణాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..అస్సాంకు చెందిన మహానంద బిశ్వాస్‌, పంపా సర్కార్‌ ఒకరినొకరు ప్రేమించుకొని ఏడాదిన్నర కిందట పెళ్లి చేసుకున్నారు.

కొంతకాలం ఆనందంగా కొనసాగిన వీరి జీవనంలో అనుమానం అనే పెనుభూతం రాజుకొని ఇద్దరి ప్రాణాలను బలికొంది. భార్య ప్రవర్తనపై మహానంద బిశ్వాస్‌ అనుమానం పెంచుకోగా..ఈ విషయమై వీరి కుటుంబంలో తరచు ఘర్షణలు జరుగుతుండేవి.

అలాగే సోమవారం మధ్యాహ్నం కూడా గొడవ జరగడంతో మహానంద బిశ్వాస్‌ కోపంతో భార్యను నీళ్ల బకెట్‌లో ముంచి చంపి..గదికి తాళం వేసి లక్డీకాపుల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని వంతెన వద్ద రైలు కింద పడి మహానంద బిశ్వాస్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్​లో జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.