ఆగ్రహంతో వికెట్లను తన్నిన బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ 3 మ్యాచ్ల పై నిషేధం – ఈ వీడియో చూడండి

Bangladesh all-rounder banned for 3 matches

0
105

క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో క్రీడాకారులకి ఒత్తిడి ఉంటుంది. కాని కూల్ గా మ్యాచ్ ఆడాలి. అప్పుడే ప్రత్యర్దులకి ఛాన్స్ ఇవ్వకుండా గెలుపు దిశగా వెళ్లవచ్చు. అయితే తాజాగా ఓ ఆటగాడికి మాత్రం తన కోపం తనకు శత్రువు అయింది. ఢాకా టీ20 ప్రీమియర్ లీగ్లో వికెట్లను తన్ని అనుచితంగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబల్ హసన్పై మూడు మ్యాచ్ లు నిషేదం విధించింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.

అంతేకాదు అతనిపై 5,800 డాలర్ల జరిమానా విధించింది. అతను చేసిన పనికి ఇంకా కఠిన చర్యలు తీసుకుంటారు అని అందరూ అనుకున్నారు. అసలు ఏం జరిగింది అంటే.

ఢాకా టీ20 ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. మొన్న అబహని లిమిటెడ్-మహ్మదాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మహ్మదాన్ జట్టుకు సారథ్యం వహిస్తున్న షకీబల్ ఎల్బీడబ్ల్యూ విషయంలో హద్దు మీరి ప్రవర్తించాడు. ఎంపైర్ కి అప్పీల్ చేసినా ఔట్ ఇవ్వలేదని కోపం చూపించాడు. ఆగ్రహంతో వికెట్లని తన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.https://twitter.com/7Cricket/status/1403330991595294720