హిందీ హీరో హృతిక్ రోషన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. హృతిక్‌తో మరో ఎనిమిది మందిపై చెన్నైలో కేసు నమోదు అయింది. రిటైలర్ మురళీధరన్ అనే రిటైలర్.. తనను హృతిక్ రోషన్‌తో పాటు ఎనిమిది మంది రూ.21 లక్షలు మోసం చేశారంటూ కొడున్ గైయ్యార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్గావ్‌కు చెందిన హెచ్ఆర్‌క్స్ బ్రాండ్ సంస్థకు స్టాకిస్ట్‌గా తనను హృతిక్ రోషన్ నియమించుకున్నారని రిటైలర్ మురళీధరన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంస్థకు సంబంధించి హృతిక్, మరో ఎనిమిది తనకు ఇవ్వాల్సిన రూ. 21 లక్షలు ఇవ్వకుండా చీటింగ్ చేశారని వాపోయారు. తనకు తెలియకుండా మార్కెటింగ్ టీమ్‌తో కలిసి సంస్థ నుంచి ఎలాంటి వస్తువులను సక్రమంగా సరఫరా చేయలేదని ఆరోపించారు.
అమ్మకాలు లేకపోవడంతో వ్యాపారం నెమ్మదించిందని తెలిపారు. సంస్థ నుంచి పంపిన వస్తువులను తిరిగి పంపితే వాటిని తీసుకోకపోవడమే కాకుండా ఇవ్వాల్సిన సొమ్ము కూడా తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు మురళీధరన్ ఫిర్యాదు మేరకు కొడున్ గైయ్యర్ పోలీసులు హృతిక్ రోషన్, మరో ఎనిమిది మందిపై 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే దీనిపై ఇప్పటివరకూ నటుడు హృతిక్ స్పందించలేదు. ప్రస్తుతం హృతిక్ వికాశ్ బెహల్ దర్శకత్వంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ బైయోపిక్ ‘సూపర్ 30’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ పాత్ర పోషిస్తున్నారు.