పోరాడి ఓడిన పీవీ సింధు

పోరాడి ఓడిన పీవీ సింధు

0
94

ఆసియా క్రీడల్లో బాడ్మింటన్ ఫైనల్స్‌లోకి ప్రవేశించి సంచలనం సృష్టించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. మరోసారి రజత పతకంతో సరిపెట్టుకుంది.మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌ ఫైనల్స్‌లో భాగంగా ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి తై జు యింగ్‌పై 13-21, 16-21 తేడాతో పోరాడి ఓడిపోయింది.

ఆసియా క్రీడల్లో సింగిల్స్ విభాగంలో ఓ భారత షట్లర్ ఫైనల్స్‌లోకి చేరుకోవడం ఇదే తొలిసారి.ఏషియాడ్‌లో రెండు వ్యక్తిగత పతకాలు గెలుచుకోవడం కూడా ఇదే మొదటిసారి. సోమవారం జరిగిన సెమీఫైనల్ పోరులో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కాంస్యం పతకం దక్కించుకున్న సంగతి తెలిసిందే. సెమీఫైనల్స్‌లో సైనాను ఓడించింది కూడా తై జు యింగే కావడం విశేషం.