జానకమ్మ చేతుల మీదుగా అవార్డు ఇప్పించి నన్ను లాక్ చేశాడు

జానకమ్మ చేతుల మీదుగా అవార్డు ఇప్పించి నన్ను లాక్ చేశాడు

0
91

నిన్న హైదరాబాద్ లో 16వ సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిరథమహారథులు ఎంతోమంది హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి అవార్డు రాగా.. ఆ అవార్డును గానకోకిల జానకి అందించారు. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్.

తనకు అవార్డు ఇస్తానని అంటే వేడుకకు రానని, ఇవ్వను అంటేనే వస్తానని సురేశ్‌తో ముందే చెప్పానని, అయితే నన్ను మోసం చేసి, జానకమ్మ చేతుల మీదుగా అవార్డు ఇప్పించి, నన్ను లాక్ చేశాడని, అందుకే కాదనలేకపోయానని చిరంజీవి అన్నారు. తొలిసారిగా జానకమ్మ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్నందుకు గర్వంగా ఉందని, ఇదే అవార్డును మరొకరి చేతుల మీదుగా ఇప్పించి ఉంటే సున్నితంగా తిరస్కరించవాడినని చిరంజీవి చెప్పారు.ఇక గత ఐదేళ్లుగా ఈ ఫంక్షన్‌కు రావాలని సురేశ్ అడుగుతుంటే రాలేకపోయానని చెప్పిన జానకమ్మ, చిరంజీవి సినిమాల్లోని హిట్ సాంగ్స్ అన్నీ తనవేనని గుర్తు చేసుకున్నారు. ఆయన నటించిన ఖైదీ నంబర్ 150 ఇటీవల చూశానని, అందులో పాత చిరంజీవిని చూసినట్లే ఉందని అన్నారు.