ఫొటోస్ మార్ఫింగ్ మెగా ఫ్యాన్స్ ఫైర్

ఫొటోస్ మార్ఫింగ్ మెగా ఫ్యాన్స్ ఫైర్

0
63

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరరీతిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం… చంటిఅబ్బాయ్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి ఈ ఫొటోలను పోస్ట్ చేశారు.ఈ ఫొటోలను చూసిన శ్రావణ్ అనే వ్యక్తి ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ కేసును సైబర్ క్రైమ్ కు బదిలీ చేశారు. విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు… ఫొటోలు అప్ లోడ్ అయిన ఐపీ అడ్రస్ ను కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు.

మరోవైపు, ఈ అంశంపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. పవన్ తల్లిని వివాదాల్లోకి లాగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.