హైదరాబాద్ వస్తుండగా ఎమ్మెల్యే కారు ఆక్సిడెంట్..

హైదరాబాద్ వస్తుండగా ఎమ్మెల్యే కారు ఆక్సిడెంట్..

0
60

బుధవారం ఉదయం నిద్ర లేవగానే తెలుగు ప్రజలు, తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనే వార్త వినాల్సి వచ్చింది. అయితే అలాంటి ప్రమాదం నుండే ఎపీకి చెందిన కందుకూరు ఎమ్యెల్యే పోతుల రామారావుకి తృటిలో తప్పించుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన తన కారులో గన్నవరం మండలం కేసరపల్లి సమీపానికి రావడంతో సడన్ గా అడ్డు వచ్చిన స్కూటీని ఢీ కొట్టింది. కారు కొట్టిన స్పీడ్ కి స్కూటీ వెళ్లి దూరాన పడింది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న భార్య, భర్తల్లో భార్య అక్కడికక్కడే మరణించగా భర్త మాత్రం తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో స్థానికులు పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో ఎమ్యెల్యే వాహనం స్కూటీని ఢీకొట్టి..డివైడర్ ఎక్కి పక్కనే ఉన్న స్థంభాన్నీ డీకొని ఆగిపోయింది. ఆ స్తంభం గనుక అక్కడ లేకపోయి ఉంటె కారు పల్టీ కొట్టేడని అక్కడి ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అంటే ఎమ్యెల్యే పోతుల రామారావుకి పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి.