అడ్డదారుల్లో వెళ్తూ నన్ను విమర్శిస్తారా ?

అడ్డదారుల్లో వెళ్తూ నన్ను విమర్శిస్తారా ?

0
123

అవినీతిని లేకుండా చేస్తానని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ అవినీతి కేసులు ప్రధానికి కనబడలేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.ఏపీకి రైల్వేజోన్‌ ఇస్తామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ రాజ్యసభలో ప్రకటించారని, సుప్రీంలో వేసిన అఫిడవిట్‌లో రైల్వే జోన్ ఇవ్వలేమన్నారని చెప్పారు. ప్రజల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర రాజకీయాలు చేస్తే సహించేది లేదని, కేంద్రంతో విరోధం పెట్టుకుంటే జైలులో ఉండాల్సి వస్తుందని కొందరు భయపడుతున్నారని, జైలు భయంతోనే కేంద్రానికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి అన్యాయం చేసిన కేంద్రంపై పోరాడుతున్నామని తెలిపారు.

విభజన హామీలపై వైసీపీ, జనసేన ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు. తనది యూటర్న్‌ కాదని, రైట్‌ టర్న్అని చంద్రబాబు స్పష్టం చేశారు. అడ్డదారుల్లో వెళ్తూ తనను విమర్శిస్తారా అంటూ మరోసారి ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతోపాటు అన్ని డిమాండ్లు సాధించుకుంటామని, కడప స్టీల్‌ప్లాంట్‌ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. అనుమతి ఇస్తే స్టీల్‌ప్లాంట్‌ తామే ఏర్పాటు చేసుకుంటామని చెప్పామని బాబు స్పష్టం చేశారు.