వచ్చే ఏడాది న్యూజిలాండ్‌కు టీమిండియా

వచ్చే ఏడాది న్యూజిలాండ్‌కు టీమిండియా

0
45

వచ్చే ఏడాది జనవరిలో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అదే సమయంలో మహిళల జట్టు కూడా కివీస్‌లోనే పర్యటించనుంది. మంగళవారం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ ఏడాది డిసెంబరు చివరి వారం నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఆ దేశ పురుషుల, మహిళల జట్లు సొంతగడ్డపై ఆడబోయే మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా భారత పురుషుల జట్టు కివీస్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. భారత మహిళల జట్టు మాత్రం మూడు వన్డేలు, మూడు టీ20ల్లో పోటీ పడుతుంది. ఇరు జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు ఒకే రోజు, ఒకే మైదానంలో జరగనున్నాయి. ముందు మహిళల జట్టు మ్యాచ్ ముగిసిన అనంతరం పురుషుల జట్టు మ్యాచ్ జరగనుంది. తొలి టీ20 కూడా ఒకే రోజు, ఒకే మైదానంలో జరగనుంది. ‘ భారత పురుషుల, మహిళల జట్లతో పోటీపడడానికి ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతం కోహ్లీ సేన వన్డేల్లో, టీ20ల్లో రెండో ర్యాంక్‌లో కొనసాగుతుంది’ అని న్యూజిలాండ్ క్రికెట్ కమిటీ సీవోవో తెలిపింది.

పురుషుల షెడ్యూల్
జనవరి 23- తొలివన్డే,
జనవరి 26- రెండో వన్డే,
జనవరి 28- మూడో వన్డే,
జనవరి 31- నాలుగో వన్డే,
ఫిబ్రవరి 3- ఐదో వన్డే
ఫిబ్రవరి 6- తొలి టీ20,
ఫిబ్రవరి 19- రెండో టీ20,
ఫిబ్రవరి 10- మూడో టీ20.

మహిళల షెడ్యూల్
జనవరి 24- మొదటి వన్డే,
జనవరి 29- రెండో వన్డే,
ఫిబ్రవరి 1- మూడో వన్డే,
ఫిబ్రవరి 6- తొలి టీ20,
ఫిబ్రవరి 8- రెండో టీ20,
ఫిబ్రవరి 10- మూడో టీ20.