శర్వానంద్ తో గొడవ పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి

శర్వానంద్ తో గొడవ పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి

0
46

హీరోయిన్ సాయి పల్లవి. ఈమె క్యాల్షీట్ల కోసం ఎంతోమంది దర్శకనిర్మాతలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఈమె నటించిన ప్రతి సినిమాలో హీరోతో గొడవలు పడుతుంటుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘ఫిదా’ సమయంలో వరుణ్, ‘ఎమ్‌సీఏ’ చిత్రీకరణలో నానితో సాయిపల్లవి గొడవ పడినట్లు వార్తలు హల్‌చల్ చేశాయి.

వీటన్నింటికి ఊతం ఇస్తూ సాయి పల్లవికి, తనకు మధ్య గొడవలు జరిగాయని హీరో నాగశౌర్య బహిరంగంగా చెప్పడంతో ముందు వార్తలు కూడా నిజమని చాలామంది అనుకున్నారు. కాగా ఇటీవల శర్వానంద్‌తో సాయి పల్లవి గొడవపడ్డట్లు పుకార్లు షికార్లు చేశాయి. ‘పడిపడి లేచే మనసు’ చిత్రంలో ఈ ఇద్దరు నటిస్తుండగా.. చిత్రీకరణ సమయంలో హీరో, హీరోల మధ్య గొడవలు వచ్చాయని, అందుకే షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చారని గుసగుసలు వినిపించాయి. ఇవి కాస్త సాయి పల్లవి వరకు వెళ్లడంతో వాటిపై ఆమె స్పందించింది. తనకు, శర్వాకు మధ్య ఎలాంటి గొడవలు లేవని తేల్చి చెప్పింది. తామిద్దరం వేరే ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్లనే షూటింగ్‌కు గ్యాప్ వచ్చిందని ఆమె స్పష్టం చేసింది. మరి సాయి పల్లవిపై ఇలాంటి వార్తలకు ఇప్పటికైనా చెక్ పడుతుందేమో చూడాలి.