ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ మెగా వేలాన్ని బెంగళూరు వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 7, 8 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఓ బోర్డు అధికారి తెలిపారు.
ఈ మెగా ఆక్షన్ యూఏఈలో జరుగుతుందని ప్రచారం సాగింది. అయితే కరోనా కారణంగా ఇక్కడే నిర్వహించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. కొవిడ్ పరిస్థితుల వల్ల ఈ మెగా వేలం ప్రక్రియను భారత్లో నిర్వహిస్తున్నాం. రెండు రోజుల పాటు ఫిబ్రవరి 7,8 తేదీల్లో జరగుతుంది. బెంగళూరులో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
ఐపీఎల్ 2022లో ఈ సారి పది జట్లు పాల్గొననున్నాయి. లక్నో, అహ్మాదాబాద్ టీమ్స్ కొత్తగా వచ్చిన నేపథ్యంలో ఈ మెగా వేలం జరగనుంది. కొత్త జట్లు మినహా పాత టీమ్స్ అన్నీ తాము రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఇటీవలే ప్రకటించాయి.