అంతర్జాతీయ క్రికెట్ కు ధోని గుడ్ బై…?

అంతర్జాతీయ క్రికెట్ కు ధోని గుడ్ బై...?

0
62

ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ధోని. ఎలాంటి సందర్భమైన కూల్ గా ఉంటూ తమ జట్టును ముందుకు నడిపిస్తాడు. చాలా కాలం తరువాత తన కెప్టెన్సీ లో ఇండియా కి వన్డే వల్డ్ కప్ అందించాడు.

ఇప్పటికే టెస్టులకి వీడ్కోలు పలికిన ఈ దిగ్గజం త్వరలో మొత్తం క్రికెట్ కె వీడ్కోలు పలకనున్నాడని తెలుస్తుంది. నిన్న జరిగిన ఇంగ్లాండ్ మూడో వన్డే లో కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంగ్లాండ్‌తో చివరి వన్డే అనంతరం ధోనీ మైదానాన్ని వీడి వెళ్లే సమయంలో ఫీల్డ్‌ అంపైర్ల నుంచి మ్యాచ్‌ బాల్‌ను అడిగి తీసుకున్నాడు.

ఎవరైనా గెలిచిన మ్యాచ్‌లో గుర్తుగా ఇలా తీసుకుంటారు కానీ ధోనీ ఓడిన మ్యాచ్‌లో బంతిని తీసుకోవడంపై అందరిలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టెస్టులకు వీడ్కోలు పలికే సమయంలోనూ ధోనీ ఇలాగే వికెట్లపై ఉండే బైల్స్‌ను తీసుకున్నాడు.

తాజాగా అంపైర్ల నుంచి బంతిని తీసుకోవడంతో అభిమానుల మదిలో ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడేమోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంగ్లాండ్‌తో లార్డ్స్, లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో ధోనీ ఆటతీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. పరుగులు రాబట్టాల్సిన సమయంలో ధోనీ పరుగులేమీ చేయకపోవడంతో అభిమానులు, క్రీడా విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న సంగతి అందరికి తెలిసిందే.