నెం 1 ర్యాంకింగ్‌ను పటిష్ఠం చేసుకున్నా విరాట్

నెం 1 ర్యాంకింగ్‌ను పటిష్ఠం చేసుకున్నా విరాట్

0
103

విరాట్ కోహ్లీ.. ఐసీసీ వన్డే నంబర్‌వన్ ర్యాంకింగ్‌ను మరింత పటిష్ఠం చేసుకున్నాడు. 911 ర్యాంకింగ్ పాయింట్లు నమోదు చేశాడు. ఇంగ్లండ్ చేతిలో భారత్ సిరీస్ చేజార్చుకున్నా.. విరాట్ మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 75, 45, 71 పరుగులు చేసి రెండు పాయింట్లను సంపాదించాడు. అయితే మార్చి 1991లో ఆసీస్ క్రికెటర్ డీన్ జోన్స్ (918) నెలకొల్పిన రికార్డు తర్వాత ఇదే అత్యుత్తమం. రెండు వన్డేల్లో రెండు శతకాలు బాదిన రూట్ (818) రెండో ర్యాంక్‌లో కొనసాగుతుండగా, బాబర్ ఆజమ్ (808), రోహిత్ శర్మ (806), డేవిడ్ వార్నర్ (803) టాప్-5లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తొలిసారి టాప్-10లోకి దూసుకొచ్చాడు. అతను ఎనిమిది స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. ఈ సిరీస్‌లో 9 వికెట్లు తీయడం కుల్దీప్‌కు బాగా కలిసొచ్చింది. భారత స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతుండగా… టాప్-10లో ఐదుగురు స్పిన్నర్లు రషీద్ ఖాన్ (2), తాహిర్ (7), ఆదిల్ రషీద్ (8), చాహల్ (10) ఉండటం విశేషం. ఆల్‌రౌండర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. షకీబ్, హఫీజ్, నబీ, సాంట్నెర్, మాథ్యూస్ వరుసగా ఐదు ర్యాంక్‌ల్లో ఉన్నారు.