శ్రీ రెడ్డి పై ఫైర్ అయినా చినబాబు

శ్రీ రెడ్డి పై ఫైర్ అయినా చినబాబు

0
27

ఇటీవ‌ల త‌మిళ ద‌ర్శ‌కులు సుంద‌ర్ సి, మురుగ‌దాస్‌, రాఘ‌వ లారెన్స్‌, హీరో శ్రీరామ్‌ల‌పై శ్రీరెడ్డి ఆరోప‌ణలు చేసింది. వారి గురించి ఆమె పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్‌లు చాలా వ‌ల్గ‌ర్‌గా ఉన్నాయి. ఆమె మాట‌లు, ఆమె పోస్ట్‌లు ఇపుడు కోలీవుడ్‌ని కుదిపేశాయి. మొన్న‌టి వ‌ర‌కు టాలీవుడ్ సెల‌బ్రిటీలు ఎంత ఇబ్బంది ప‌డ్డారో ఇపుడు కోలీవుడ్ తార‌లు అంతే ఇబ్బంది ప‌డుతున్నారు.

ఐతే ఇది సెన్సిటివ్ ఇష్యూ కావ‌డంతో ఎవ‌రూ బ‌హిరంగంగా ఆమెని విమ‌ర్శించ‌డం లేదు. కార్తీ మాత్రం ధైర్యంగా స్పందించాడు.

శ్రీరెడ్డి ఆరోప‌ణ‌ల‌కి కోలీవుడ్ మౌనం వ‌హించ‌ద‌ని గ‌ట్టిగా చెప్పాడు ఈ చిన‌బాబు. త్వ‌ర‌లోనే ఆమెకి లీగ‌ల్ నోటీసులు గ‌ట్టిగా అందుతాయ‌ని తెలిపాడు. ఆధారాలుంటే ఎవ‌రైనా లీగ‌ల్‌గా వెళ్లొచ్చు. సెల‌బ్రిటీలం క‌దా సైలెంట్‌గా ఊరుకుంటామ‌నుకోవ‌ద్ద‌ని కార్తీ ఫైర్ అయ్యాడు.

శ్రీరెడ్డి ద‌గ్గ‌ర నిజంగా ఆధారాలుంటే …డైర‌క్ట్ పోలీసు స్టేష‌న్‌కి వెళ్లి కేసు పెట్టేది. నిజానికి ఎవ‌రైనా అలాగే చేస్తారు. కానీ తాంబూలాలు ఇచ్చేశా తన్నుకు చావండి అన్న‌ట్లు ఆమె బిహేవ్ చేస్తోంది. కేవ‌లం ఆరోప‌ణలు చేయ‌డ‌మే ప‌ని అన్న‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తోంది. మీడియా కూడా నిరాధార ఆరోప‌ణ‌ల‌కి ప్రాధాన్యం ఇస్తోంది…ఇలా శ్రీరెడ్డిపై విరుచుకు ప‌డ్డాడు త‌మిళ యువ హీరో కార్తీ.

మొత్తానికి కోలీవుడ్ హీరోల్లో కొంత ధైర్యం ఉంద‌నిపిస్తోంది.