దిల్ రాజు ప్లాన్ అదిరిపోయింది

దిల్ రాజు ప్లాన్ అదిరిపోయింది

0
87

నిర్మాత దిల్ రాజు తాజాగా అయిదు సినిమాలతో బిజీ గా ఉన్నాడు , అందులో ఒకటి ఎల్లుండి విడుదల అవుతుండగా మరో నాలుగు చిత్రాల విడుదల తేదీ లను కూడా ప్రకటించాడు . అందులో ముఖ్యమైనది మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం కావడం విశేషం . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి దిల్ రాజు తో పాటు అశ్వనీదత్ , పివిపి లు కూడా నిర్మాతలే ! ఇక ఈ చిత్రాన్ని విడుదల చేసేది ఎప్పుడో తెలుసా…….. 2019 ఏప్రిల్ 25న . వేసవిలో భారీ ఎత్తున మహేష్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు .

ఇక మిగతా సినిమాల విషయానికి వస్తే …….. ఈనెల 20న రాజ్ తరుణ్ హీరోగా నటించిన ” లవర్ ” చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు దిల్ రాజు . దాని తర్వాత నితిన్ హీరోగా నటించిన ” శ్రీనివాస కళ్యాణం ” చిత్రాన్ని ఆగస్టు 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు ఈ చిత్రానికి శతమానం భవతి వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న దర్శకుడు . ఇక అక్టోబర్ 18న దసరా కానుకగా రామ్ – అనుపమా పరమేశ్వరన్ జంటగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కిన ” హలో గురూ ప్రేమకోసమే ”చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు దాని తర్వాత సీనియర్ హీరో వెంకటేష్ – యంగ్ హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ” F 2” ని 2019 జనవరి 12 న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు . ముఖ్యమైన పండగలను అలాగే మంచి డేట్ లను బ్లాక్ చేసి పెట్టుకున్నాడు దిల్ రాజు .