ఆశ్చ‌ర్య‌పోతున్న అభిమానులు – మాయ చేస్తున్న డుప్లెసిస్‌

ఆశ్చ‌ర్య‌పోతున్న అభిమానులు - మాయ చేస్తున్న డుప్లెసిస్‌

0
95
Chennai Super Kings cricketer Faf du Plessis plays a shot during the 2019 Indian Premier League (IPL) Twenty20 cricket match between Kings XI Punjab and Chennai Super Kings at the Punjab Cricket Association Stadium in Mohali on May 5, 2019. (Photo by Sajjad HUSSAIN / AFP) / ----IMAGE RESTRICTED TO EDITORIAL USE - STRICTLY NO COMMERCIAL USE-----

ఐపీఎల్ ఆట‌లో అస‌లైన మ‌జా క‌నిపిస్తోంది, బౌల‌ర్ల బంతుల‌కి బ్యాట్స్ మెన్స్ విజృంభ‌ణ‌కు ఈసారి ఐపీఎల్ స‌రికొత్త‌గా సాగుతోంది, ప‌రుగుల వ‌ర్షం కురిపిస్తున్నారు, అయితే ఈ ఐపీఎల్‌లో సీఎస్‌కే ఆటగాడు డుప్లెసిస్‌ మాయచేస్తున్నాడు. బంతిని గ‌ట్టిగా బాదాము క‌దా ఇది సిక్స్ వెళుతుంది అని అనుకునేలోపు దానిని క్యాచ్ ప‌ట్టుకుంటున్నాడు.

బౌండరీ లైన్‌పై ఎగిరేసి అమాంత క్యాచ్‌ పట్టేసి ఔరా అనిపిస్తున్నాడు. క్యాచ్‌ పట్టే క్రమంలో నియంత్రణ చేసుకోవడానికి బౌండరీ లైన్‌ దాటేసినా బంతిపై ఏకాగ్రత మాత్రం కోల్పోవడం లేదు. బంతిని మ‌ళ్లీ గాలిలోకి విసిరి దానిని ప‌ట్టుకోవ‌డం అంద‌రిని శ‌భాష్ అనిపిస్తోంది.

ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో సౌరవ్‌ తివారీ, హార్దిక్‌ పాండ్యాలను ఇలాగే అవుట్ చేశాడు,తాజాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కీలకమైన డేవిడ్‌ వార్నర్‌ ఇచ్చిన క్యాచ్‌ను పట్టేసుకున్నాడు.సీఎస్‌కే స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా వేసిన 11వ ఓవర్‌ ఐదో బంతికి వార్నర్‌ భారీ షాట్‌ కొట్టాడు. అంద‌రూ అనుకున్నారు అది సిక్స్ అని, కాని అక్క‌డ ఉంది డుప్లెసిస్ ఆ బంతిని గాలిలో ఎగిరి ప‌ట్టుకున్నాడు.