ఎఫ్ 3 లో పిసినారి పాత్ర – ఈ రోల్ ఎవరు చేస్తున్నారంటే ?

Director Anil Ravipudi Movie Picinari role in F3

0
114

 

సినిమాల్లో పిసినారి పాత్ర అంటే వెంటనే మనకు ఆహానపెళ్లంట సినిమా గుర్తు వస్తుంది. అందులో కోటశ్రీనివాసరావు – బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ఎవరూ మర్చిపోలేరు. ఇక నిజ జీవితంలో ఎవరైనా పిసినారిని చూసినా పోల్చినా మనకు కోటనే గుర్తు వస్తారు. కోట శ్రీనివాసరావు పాత్ర సినిమాకి ప్రాణం పోసింది. ఇక తాజాగా ఎఫ్ 3 సినిమాలో ఇలాంటి ఓ పిసినారి పాత్ర ఉంటుందట.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సెట్స్ పై ఉంది .ఈ సినిమా కరోనా ప్రభావం వల్ల షూటింగ్ వాయిదా పడింది. మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయితే, నెల రోజుల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయట. మరి అనిల్ ఎవరిని ఇందులో పిసినారిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అంటే ? రాజేంద్రప్రసాద్ ని పిసినారిగా చూపించి ఫన్ అందించే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి పాత్రలు ఆయన సూపర్ గా చేస్తారని, అందుకే ఆయనని కలిసి ఇప్పటికే స్టోరీ గురించి నేరేట్ చేశారట. తమన్నా, మెహరీన్లు కథానాయికలుగా వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో. రాజేంద్రప్రసాద్ అభిమానులు ఈ వార్త విని ఫుల్ ఖుషీ అవుతున్నారు.