గీత గోవిందం ఫుల్ మూవీ లీక్

గీత గోవిందం ఫుల్ మూవీ లీక్

0
137

ఈ మధ్య సినిమాలు విడుదల కాకముందే లీక్ అవుతూ చిత్ర దర్శక నిర్మాతలని షాక్ కి గురిచేస్తున్నాయి. దీనిపై చిత్ర నిర్మాతలు ఎంత జాగ్రత్తలు తీసుకున్న అరికట్టలేకపోతున్నారు. ఇంతకుమునుపు కనీసం సినిమా రెలీజ్ అయ్యాకైనా పైరసీ రూపంలో బయటకివచ్చేది కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే బయటకివస్తుంది.

ఇప్పుడు విజయదేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా ఆగస్టు 15 న రిలీజ్ కి సిద్ధమైంది. కానీ గీత గోవిందం సినిమా పెన్ డ్రైవ్స్ లో కనిపించి సినిమా వారికీ పెద్ద షాక్ ఇచ్చింది. దీనిపై సినిమా యూనిట్ సైబర్ క్రైమ్ వారికీ రిపోర్ట్ చేయగా వారు కేసుని వేగవంతం చేసి నిందుతులని పట్టుకున్నారు.

ఆ అమ్మాయికి పరిచయమున్న ఓ యువకుడు సినిమా ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడని, అతనే తన వద్ద ఉన్న సినిమాను అత్యుత్సాహంతో ఆమెకు పంపాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గీత గోవిందం సినిమా ప్రింట్ కాపీని అమరావతి పరిధిలోని తాడేపల్లి, కేఎల్ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థిని లీక్ చేసినట్టు గుంటూరు పోలీసులు గుర్తించారు.