గీత గోవిందం మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సమంత

గీత గోవిందం మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సమంత

0
104

విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం గీత గోవిందం.ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ విజయాన్ని సమంత తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ . సమంత తో సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? సమంత క్రాకర్స్ తో సెలబ్రేట్ చేసుకున్నాడు . ఓ క్రాకర్స్ సంస్థ సమంత ఫోటోలను వాడుకుంటూ తమ అమ్మకాలను సాగిస్తోంది కాగా ఆ సమంత ఫోటో ఉన్న క్రాకర్స్ ని కాల్చి తన సంతోషాన్ని పంచుకున్నాడు అంతేకాదు ఈ విషయాన్ని గురించి సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేసాడు .

దానికి సమంత కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రీ ట్వీట్ చేసింది . ఆగస్టు 15 న విడుదలైన గీత గోవిందం చిత్రం సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది . విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించగా బన్నీ వాసు నిర్మించాడు . మొదటి రోజునే పదికోట్ల షేర్ సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది . విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ తో భారీ వసూళ్ల ని సాధిస్తోంది గీత గోవిందం .