“మజిలి” గా నాగ చైతన్య సమంత

"మజిలి" గా నాగ చైతన్య సమంత

0
95

నాగ చైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం కోసం టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లైన భార్య భర్తల మధ్య జరిగే కథాంశంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి మజిలి అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా వివాహం తరువాత చైతన్య, సమంత నటిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.