వైసీపీ అధికారంలోకి వస్తే ఆ ముగ్గురు జైలుకే

వైసీపీ అధికారంలోకి వస్తే ఆ ముగ్గురు జైలుకే

0
50

మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి అధికారంలోకి వస్తే ప్రస్తుత సీఎం చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమాల అవినీతిపై విచారణ చేపడతామని… వీళ్లంతా జైలు యాత్ర చేయాల్సిందేనని వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన…” తెలుగుదేశం ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును పూర్తి చేస్తాం. వైఎస్ హయాంలో నేను అవినీతికి పాల్పడినట్టు రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను” అని వైవీ సుబ్బారెడ్డి సవాల్ చేశారు.