ఇంగ్లండ్ తో సిరీస్ ను గెలిచేశామన్న హిట్ మ్యాన్

Hitman who won the series with England

0
110

ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ అర్థాంతరంగా ముగిసిపోయిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దయిపోయింది. వచ్చే ఏడాది జులైలో మ్యాచ్ ను నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెబుతున్నా..దానిపై ఇంకా ఎటూ తేల్చలేదు.

సిరీస్ లో భారత్ 2–1తో ఆధిక్యంలో ఉంది. అయితే, ఆ సిరీస్ ను తాము 2–1తో తమ సొంతం చేసుకున్నామని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కామెంట్ చేశాడు. రద్దయిన టెస్ట్ సంగతి తనకు తెలియదని, ఇప్పటికైతే సిరీస్ తమదేనని తేల్చేశాడు రోహిత్.

నా టెస్ట్ కెరీర్ లో ఇంగ్లండ్ పర్యటన మంచి సిరీసే. కాకపోతే నాది అత్యుత్తమ ప్రదర్శన మాత్రం కాదు. ఇంకా మెరుగ్గా రాణించాల్సిన అవసరముంది’ అని అన్నాడు. టెస్ట్ వరల్డ్ కప్ (డబ్ల్యూటీసీ)కు ముందు సౌథాంప్టన్ లో ఇంగ్లండ్ పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాననిహిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు.