ఐపీఎల్ 2020 ముగిసిపోయింది, ముంబై జట్టు విజయం సాధించింది, ఈసారి టైటిల్ ముంబై గెలిచింది, అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ కి సన్నాహాలు మొదలు అవుతున్నాయి, మరో ఆరు నెలల్లో ఐపీఎల్ జరుగనుంది. బీసీసీఐ ఇప్పటికే ప్లాన్ రెడీ చేస్తోంది, త్వరలో దీనికి సంబంధించి వేలం కూడా జరుగనుంది. ఫ్రాంచైలకు సూచనలు కూడా వస్తున్నాయట.
అయితే వచ్చే ఏడాది సీజన్ లో మరో కొత్త జట్టు ఎంట్రీ ఇవ్వనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.కొత్తగా గుజరాత్ ఫ్రాంఛైజీ టోర్నీలో అడుగుపెట్టనుంది. ఇప్పటివరకు 8 జట్లు ఐపీఎల్లో ఆడుతూ ఉండగా.. 9 జట్టుగా గుజరాత్ ఆడనుంది . వచ్చే ఏడాది పోటీలో గుజరాత్ జట్టు రానుంది, ఈ జట్టుని ఓ కార్పొరేట్ దిగ్గజం సొంత చేసుకోనున్నారట,
అయితే దీనికి అహ్మాదాబాద్ బేస్ పేరు సెలక్ట్ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై నిషేధం వేటు పడిన సమయంలో గుజరాత్ లయన్స్ జట్టు 2016, 2017 సీజన్లలో ఐపీఎల్ ఆడిన సంగతి తెలిసిందే, ఇప్పుడు నేరుగా మళ్లీ టీమ్ రానుంది అని వార్తలు వస్తున్నాయి.