కికి ఛాలంజ్ రీసెంట్ గా ఎక్కువగా వినబడుతున్న గేమ్ ఇది. ఇది ఇప్పుడు ప్రపంచాన్నే కుదిపేస్తున్నది. ప్రయాణిస్తున్న వాహనం నుంచి కిందకు దిగి డ్యాన్స్ చేస్తూ, మళ్లీ వాహనంలోకి ఎక్కడమే ఈ ఛాలెంజ్. ఈ గేమ్ ఎంతో సరదాగా ఉన్నప్పటికీ చాల మంది ఈ ఛాలెంజ్ వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీని వలన పోలీసులు ఈ ఛాలంజ్ ఫై నిషదం విధించారు.
తాజాగా టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్, నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ లు సరదాగా కికి ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఇది రోడ్డుపై కాదులెండి, సురక్షితమైన ప్రాంతంలోనే. వీరిద్దరూ కొంచెం వెరైటీగా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. కదిలే వీల్ చైర్ మీద నుంచి లేచి డాన్స్ చేసి మల్లి అదే వీల్ చైర్ లో కూర్చున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.