రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఫిక్స్…

రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఫిక్స్...

0
57

వరుసగా సినిమాలు చేస్తున్న మెగా హీరో రామ్ చరణ్. ప్రస్తుతం బోయపాటి చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్ ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ఓ మల్టీస్టారర్‌లో నటించనున్నాడు. ఇక ఈ చిత్రం తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించేందుకు చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి ఇప్పుడు మహేశ్ బాబుతో ‘మహర్షి’ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం తరువాత చెర్రీని డైరక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్న వంశీ, ఇటీవల అతడిని కలిసి ఓ కథ చెప్పాడట. ఈ కథ చరణ్‌కు బాగా నచ్చిందని, అందుకే అందులో నటించేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా వంశీ పైడిపల్లి, చరణ్ కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన ‘ఎవడు’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.