సలార్ లో ఆ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్?

0
115

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఆయనతో సినిమా చేయాలి అని చాలా మంది దర్శకులు క్యూ కడుతున్నారు. నిర్మాతలు కూడా ఆయన ఎంత కోరితే అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ప్ర‌స్తుతం ఆయన పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ విడుదల దిశగా సన్నాహాలు చేసుకుంటోంది.

మరో పక్క సలార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఊపేసే ఒక మసాలా సాంగ్ ఉందట. ఈ పాట కోసం హీరోయిన్ కత్రినాని తీసుకునే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమెకి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్దం అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శ్రుతి హాసన్ అలరించనుంది. మ‌రో రెండు స్టోరీలు కూడా ప్ర‌భాస్ వింటున్నార‌ని వీటిపై కూడా కొద్ది రోజుల్లో ప్ర‌క‌ట‌న రావ‌చ్చు అంటున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు.