అతనొక గొప్ప డ్యాన్సర్ : రేణూ దేశాయ్

అతనొక గొప్ప డ్యాన్సర్ : రేణూ దేశాయ్

0
60

నటరుద్ర ఎన్టీఆర్ ప్రతిభ ఏంటో అందరికీ తెలుసు. నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, భిన్నమైన పాత్రలు పోషించడం.. వీటన్నింటిలోనూ అవపోసిన పట్టిన ఈ నటరుద్రుడికి దిగ్గజాలు సైతం దాసోహం. ఈ జనరేషన్‌లో మరే హీరోకి సాధ్యంకాని స్థాయిలో తన ట్యాలెంట్‌తో క్రేజ్ సంపాదించుకున్నాడు తారక్. అందుకే.. అతని ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సెలెబ్రిటీలు ఉప్పొంగిపోతారు.. అతనిని ప్రశంసలతో ముంచెత్తుతారు. సందర్భం ఏదైనా సరే.. అతని ప్రస్తావన వస్తే మాత్రం పొగడ్తలు కురిపించకుండా ఉండలేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా తారక్‌ని ఆకాశానికెత్తేసింది.

రేణూ ప్రస్తుతం ‘నీతోనే డ్యాన్స్’ ప్రొగ్రామ్‌ని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఓ కంటెస్టంట్ తారక్ పాటపై పెర్ఫామ్ చేయగా.. ఆ కంటెస్టంట్ మీద తన అభిప్రాయం చెప్పడానికి ముందు తారక్ గురించి మాట్లాడింది. లెజెండరీ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈ జనరేషన్‌లో ఒక్క తారక్ మాత్రమే పౌరాణిక డైలాగ్స్‌ని చాలా పర్ఫెక్ట్‌గా చెప్తాడని ఆమె కొనియాడింది. అంతేకాదు.. అతనొక గొప్ప డ్యాన్సర్ అని, ఎలాంటి స్టెప్పులైన సింపుల్‌గా చేస్తాడని తెలిపింది. ఇలాంటి పొగడ్తలు ప్రతిఒక్కరు కురిపించడం సహజమే కానీ.. పవన్ మాజీ భార్య ఇలా స్పందించడంతో ఆ కామెంట్స్ ఇండస్ట్రీలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.