నేను పెళ్లిచేసుకోపోవడానికి కారణం ఆ హీరోనే..

నేను పెళ్లిచేసుకోపోవడానికి కారణం ఆ హీరోనే..

0
76
tabu about tarak

టాలీవుడ్ ,బాలీవుడ్ లో అందరికి పరిచయమున్న హీరొయిన్ టబు .అలాగే 50 ఏళ్ళు దగ్గరకు వచ్చేసిన ఇంకా పెళ్లి కాని తార ఎవరైనా వున్నారు అంటే అది కూడా టబు నే .సినీ పరిశ్రమలో మోస్ట్ ముదురు హీరొయిన్ గా పేరు తేచ్చుకున్న టబు ఇప్పటికి పెళ్లి మాట ఎత్తడం లేదు .అసలు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలు కూడా టబు ఎక్కడా ప్రస్తావించలేదు .

అయితే టబు తాజా గా తన మనసులోని మాటను బయటకు వెల్లడించింది టబు .తనకి పెళ్లి అవ్వకపోవడానికి కారణం ఒక హీరో అంటూ సరదాగా వ్యాఖ్యానించింది .నేను వివాహం చేసుకోకపోవడానికి కారణం అజయ్ దేవగణ్‌. తను నా సోదరుడికి బంధువు. నా జీవితం ఆరంభం నుంచే అజయ్ నాతో కలిసి ఉన్నాడు. మేమిద్‌ రం 25 ఏళ్లు స్నేహితులుగా ఉన్నాం. అజయ్ కారణంగానే నేను పెళ్లి చేసుకోలేదు. అలాగని, పెళ్లి చేసుకోనందుకు నాకేం బాధ లేదు అని టబు వ్యాఖ్యానించింది.

దాదాపుగా రెండు దశాబ్దాల క్రితం వెండితెర కు పరిచయమయిన టబు అటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా చాలా సినిమాలు చేసింది .తెలుగులో నిన్నే పెళ్ళాడత ,సిసింద్రీ ,పాండురంగడు ,అందరివాడు లాంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు కుడా బాగా చేరువయ్యింది .

50 ఏళ్ళు వచ్చిన టబు ఇంకా పెళ్లి చేసుకోకపోవడం తో ఆమె ఎక్కడికి వెళ్ళిన ముందు అదే ప్రశ్న ఆమె ముందు ఉంచుతున్నారు మీడియా వాళ్ళు .ఇంతకి అజయ్ దేవగణ్ తన పెళ్లి అవ్వకపోవడానికి ఎలా కారణం అయ్యాడో టబు చెప్పలేదు .