నాకు ఆ విషయం లో బెదిరింపులు వస్తున్నాయి

నాకు ఆ విషయం లో బెదిరింపులు వస్తున్నాయి

0
129

పవన్ కల్యాణ్ మాజీ భార్య అయిన నటి రేణూ దేశాయ్ ని పవన్ అభిమానులు బెదిరిస్తున్నారని ఆరోపణలు చేసింది.. అయితే ఇటీవల ఓ వ్యక్తితో గోవాలో రేణూ దేశాయ్ కి నిశ్చితార్థం జరిగిన విషయం అందరికి తెలిసిందే.. ఈ విషయంలో పవన్ అభిమానుల నుంచి బెదిరింపులు, విమర్శలు వస్తున్నాయని మరోవైపు జనసేన పార్టీని సపోర్ట్ చేయమంటూ కొందరు మర్యాదపూర్వకంగా మరికొందరు బెదిరింపుల రూపంలో మెస్సేజ్ లు, కామెంట్లు పెడుతున్నారని నా జీవితాన్ని ప్రశాంతంగా ఉండనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది..

ఓ వ్యక్తి పవన్ గురించి తప్పుగా పేర్కొంటూ ఫొటోలు షేర్ చేసినదానికి స్పందిస్తూ ఆమె ఒక పోస్ట్ పెట్టారు.. గత ఐదేళ్లనుంచి నన్ను ఎందుకు ప్రశాంతంగా ఉండనీయడం లేదు.. ట్విట్టర్ లో, ఇతర సామజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టి నా ప్రశాంతతను దెబ్బ తీస్తున్నారన్న నేపథ్యంతో ఇప్పుడు కేవలం ఇన్స్టాగ్రామ్ మాత్రమే వాడుతున్నాను.. అందులో కూడా వదలకుండా నన్ను అనరాని మాటలు అంటూ నేను చేయని తప్పులకు కూడా నన్నే నిందిస్తున్నారు.. వాటిని పట్టించుకోవద్దని నా సన్నిహితులు, కొందరు అభిమానులు సలహా ఇచ్చినప్పటికీ కేవలం నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి నా వైపు నుంచి నేను మాట్లాడుతుంటే కొందరు వాటన్నింటిని మౌనంగా భరించాలని చెప్పగా, మరికొందరు పాపులారిటీ కోసమే ఇదంతా చేస్తున్నానని విమర్శిస్తున్నారు… దానితో నా ఇన్స్టాగ్రామ్ లో కూడా మెస్సేజులు నిండిపోతున్నాయి.

ఆయనకొక రూల్, నాకొక రూల్ ఎలా ఉంటుంది… గత ఐదేళ్లుగా నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడు నా ఆత్మాభిమానం మీకు ముఖ్యం అనిపించలేదా? అప్పుడేమో నోరుమూసుకుని అన్నీ భరించమని సలహాలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పవన్ పేరుకు మచ్చ వస్తుందని నన్ను స్పందించమని అడుగుతున్నారు, నా మానాన నేనుంటే నన్నూ, నాజీవితాన్ని పక్షపాత ధోరణితో నీచంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలాంటి సమాజంలో నేనున్నందుకు చాలా బాధిస్తుంది… అని ఘాటుగా స్పందించారు.

ఎదో ఒకనాటికి నాకంటూ మనశ్శాంతి దొరుకుతుందని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.. అదేవిధంగా నేను కానీ పవన్ కి నాకు పుట్టిన పిల్లలు కానీ ఎన్నటికీ పవన్ గురుంచి తప్పుగా మాట్లాడింది లేదని.. మరో విషయంగా మాకెప్పుడు ఇతర రాజకీయ పార్టీలనుంచి అలా తప్పుగా మాట్లాడమని ఎవరు ప్రేరేపించలేదని పేర్కొంది… రెండో పెళ్లి చేసుకుని నా జీవితానికి ఒక ప్రశాంతత కల్గించుకోవాలని ఆశిస్తున్నాను దయచేసి నన్ను కానీ పవన్ ని కానీ, మాకు పుట్టిన పిల్లల గురుంచి కానీ తప్పుగా మాట్లాడవద్దని ప్రాధేయపడింది..