రసెల్ వీరవిహారం..ట్రోఫీని ముద్దాడిన గ్లాడియేటర్స్​

Russell Veeraviharam..Gladiators kissing the trophy

0
91

డెక్కన్​ గ్లాడియేటర్స్​ తొలిసారి అబుదాబి టీ10 టైటిల్​ను ముద్దాడింది. ఈ సీజన్​ ఫైనల్​లో దిల్లీ బుల్స్​పై 56 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్​ గెలుపొందింది. ఆండ్రీ రసెల్​ ధనాధన్​ ఇన్నింగ్స్​తో తొలిసారి అబుదాబి టీ10 ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది.

టాస్ ​ఓడి బ్యాటింగ్​కు దిగిన డెక్కన్​లో ఓపెనర్లు రసెల్ (32 బంతుల్లో 90; 9X4, 7×6)​, కాడ్మోర్ ​(28 బంతుల్లో 59; 3×4, 5×6) ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడారు. వీరిద్దరూ కలిసి 159 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో నిర్ణీత ఓవర్లలో వికెట్​ నష్టపోకుండా 159 పరుగులు చేశారు.

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ బుల్స్​ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులకే పరిమితమైంది. బ్యాటర్లలో చంద్రపాల్​ హేమ్​రాజ్​(42) టాప్​ స్కోరర్​గా నిలిచాడు. మిగతా వారు విఫలమైపోయారు. డెక్కన్​ బౌలర్లలో ఒడియన్​ స్మిత్ 2​, వనిందు హసరంగా 2, టైమల్​ మిల్స్ 2, ఆండ్రూ రసెల్​ ఓ వికెట్​ను దక్కించుకన్నారు.