ఒక్క సినిమాతో ఆ హీరోయిన్ కి వరుస ఆఫర్స్

ఒక్క సినిమాతో ఆ హీరోయిన్ కి వరుస ఆఫర్స్

0
122

ఆర్ఎక్స్ 100’ చిత్రంతో సెన్సేషన్ హీరోయిన్ గా మారిపోయింది పంజాబీ నటి పాయల్ రాజపుత్. ఈ చిత్రం లో గ్లామర్ తో మాత్రమే కాకుండా నటనతో నూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం తరువాత ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయట.

దాంట్లో భాగంగా యువ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న 5వ చిత్రంలో రెండవ హీరోయిన్ గా పాయల్ ను తీసుకోనున్నారని సమాచారం. నూతన దర్శకుడు శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి కాజల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. వంశధార క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈచిత్రం యొక్కమొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది . ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నిల్ నితిన్ ముఖేశ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు.